పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు, OG చిత్రాల షూటింగ్ ఆయన ముగించాల్సి ఉంది.
కానీ రాజకీయంగా ఆయన చాలా బిజీ గా ఉండటం తో ఇవి ఆలస్యం అవుతున్నాయి. అయితే ఇప్పుడు పవన్ ఒక సినిమా నుంచీ పూర్తిగా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి తో పవన్ ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ, పవన్ పొలిటికల్ గా మరింత బిజీ కావడం తో ఈ సినిమాలో ఆయన నటించబోరని తెలిపారట. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం వేరొక హీరోని సెలెక్ట్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారట. మరి నిజంగానే ఈ ప్రాజెక్ట్ నుంచి పవన్ తప్పుకున్నాడా అనేది ఆఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వేచి ఉండాల్సిందే.