బాలీవుడ్ యాక్షన్ సినిమాలో ప్రభాస్, సూర్య?

బాలీవుడ్ యాక్షన్ సినిమాలో ప్రభాస్, సూర్య?

Published on Sep 7, 2024 9:02 AM IST

ప్రస్తుతం మళ్ళీ బాలీవుడ్ మార్కెట్ మంచి ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇలా రానున్న రోజుల్లో మరిన్ని భారీ చిత్రాలు బి టౌన్ నుంచి రాబోతుండగా ఈ చిత్రాల్లో అవైటెడ్ సీక్వెల్ చిత్రం “సింగం అగైన్” కూడా ఒకటి. అజయ్ దేవగన్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా విషయంలో క్రేజీ బజ్ ఒకటి వైరల్ గా మారింది.

ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే ఒరిజినల్ సింగం సూర్యలు సాలిడ్ క్యామియో రోల్స్ లో కనిపించనున్నారు అని తెలుస్తుంది. మరి ఇది కానీ నిజం అయితే బి టౌన్ లో రెస్పాన్స్ మాములు లెవెల్లో ఉండదు అని చెప్పాలి. గతంలో ఒకసారి ప్రభాస్ “యాక్షన్ జాక్సన్” అనే సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. అలాగే రీసెంట్ గా సూర్య “సర్ఫిరా” సినిమాలో క్యామియో ఇచ్చారు. మరి ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఒక సినిమాలో కనిపిస్తారో లేదో అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి గట్టి రూమర్సే వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు