ప్రభాస్ కొత్త లుక్ లోకేష్ కోసమా? ఆరోజున అనౌన్సమెంట్?

ప్రభాస్ కొత్త లుక్ లోకేష్ కోసమా? ఆరోజున అనౌన్సమెంట్?

Published on Jan 8, 2025 9:08 AM IST

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇపుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో తన నుంచి “సలార్” నిర్మాణ సంస్థ నుంచి మూడు భారీ సినిమాలు లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో స్ట్రాంగ్ బజ్ ఒక ఊహించని కాంబినేషన్ పై కూడా ఉంది. అదే కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అలాగే ప్రభాస్ తో సినిమా కోసం.

మరి ఈ భారీ కాంబినేషన్ కోసం ఎప్పుడు నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ అఫీషియల్ గా మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ ఎప్పుడైతే హోంబళే వారు ప్రభాస్ తో మూడు సినిమాలు అనౌన్స్ చేసారో వాటిలో ఖచ్చితంగా ఒకటి లోకేష్ కనగరాజ్ తో సినిమానే అని స్ట్రాంగ్ రూమర్స్ వినిపించాయి. మరి ఈ అవైటెడ్ సెన్సేషనల్ కాంబినేషన్ ఈ సంక్రాంతి కానుకగా అనౌన్స్ కావచ్చని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి రీసెంట్ గానే ప్రభాస్ కొత్త లుక్ లోకి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. వింటేజ్ లుక్స్ లో ప్రభాస్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఓ వీడియో బైట్ వైరల్ అయ్యింది. మరి లోకేష్ కనగరాజ్ నుంచి అనౌన్సమెంట్ అంటే ఒక వీడియోతో వదులుతాడని తెలిసిందే. “విక్రమ్”, మొన్న “కూలీ” లాంటి సినిమాలకి కూడా కమల్, రజినీకాంత్ లపై వారి లుక్స్ ని రివీల్ చేసే వీడియోస్ వదిలాడు. మరి ఇది కూడా అలాంటి ప్లానింగేనా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు