Prabhas: భారీ ప్రాజెక్టులో ప్రభాస్ నటిస్తాడా..?

Prabhas: భారీ ప్రాజెక్టులో ప్రభాస్ నటిస్తాడా..?

Published on Sep 29, 2024 1:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడూతూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ది రాజా సాబ్’ చిత్రం షూటింగ్ జరుపుకుంటుండగా, దర్శకుడు హను రాఘవపూడితో ‘ఫౌజీ’ సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు. అయితే, ఈ సినిమా తరువాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ అనే సినిమా కూడా లైన్‌లో ఉంది. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఓ భారీ ప్రాజెక్టులో ప్రభాస్ నటిస్తాడా అనే ఇంట్రెస్టింగ్ టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

బాలీవుడ్‌లో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న మూవీ ‘రామాయణం’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నితీష్ తివారి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ ఎపిక్ సినిమాలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో పరశురాముడి పాత్ర కోసం మేకర్స్ ప్రభాస్‌ని అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. కానీ, ఆయన ఈ సినిమాలో నటించేది.. లేనిది అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదట.

గతంలో దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ నటించగా, అది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు మరోసారి ప్రభాస్ రామాయణం సినిమాలో నటిస్తాడా.. ఒకవేళ ఆయన నటిస్తే, పరశురాముడి పాత్రలో ప్రభాస్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడనే చర్చ సాగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు