మహేష్ కోసం పూరి సిద్ధం అవుతున్నాడట ?

Published on Oct 18, 2020 2:06 am IST

ఈ కరోనా టైమ్ లో సినిమా దర్శకులుకు కొత్త కథలు రాసుకోవడానికి మంచి అవకాశం.. అందుకే ఇప్పటికే చాలామంది దర్శకులు తమ తరువాత సినిమాల కథలను పూర్తి చేశారు. అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా ఈ కరోనా టైమ్ లో ఓ స్క్రిప్ట్ ను రెడీ చేశాడట. ఇదిలా వుంటే ఎప్పటి నుంచో పూరి మదిలో వున్న జనగనమణ సినిమా స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసి మహేష్ కి వినిపించాలనుకుంటున్నాడట పూరి. నిజానికి అప్పట్లోనే మహేష్ బాబుకు పూరి ఈ కథను వినిపించాడు.

అప్పుడు మహేష్ కి కథ నచ్చలేదు. మళ్ళీ మార్పులు చేసుకుని వస్తా అని చెప్పిన పూరి, ఆ తరువాత మళ్ళీ ఆ కథ మీద కూర్చోలేదు. మధ్యలో ఆ సినిమాని రానాతో చేయలన్నా కుదరలేదు. ఇక ఇటివలే మహేష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పూరి కథ చెబితే వింటానని చెప్పుకొచ్చాడు. దానికి తగ్గట్లుగానే పూరి కూడా రెడీ అవుతున్నాడు. అన్నట్టు భారత దేశంలో అవినీతి జాఢ్యం నేపథ్యంలో ఈ జనగనమణ కథను పూరి రాస్తున్నాడట. అంటే ఈ కథ మొత్తం మన వ్యవస్థలో లోపాల చుట్టూ, అలాగే మన న్యాయ వ్యవస్థలోని డొల్లతనం చుట్టూ కథ సాగుతుందట.

సంబంధిత సమాచారం :

More