SSMB 29: రాజమౌళి మొదటిసారి ఇలా!?

SSMB 29: రాజమౌళి మొదటిసారి ఇలా!?

Published on Jan 1, 2025 6:04 PM IST

ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసమే అని చెప్పాలి. మరి మహేష్ కెరీర్ లో 29వ చిత్రంగా దీనిని గ్లోబల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ జనవరి 2న అవైటెడ్ ముహూర్త కార్యక్రమాలతో సినిమా లాంఛ్ కాబోతుండగా అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

అయితే ఈ సినిమా కోసం రాజమౌళి తన ఫార్మాట్ ని మార్చినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఇది వరకు రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా దానిని మొదలు పెట్టిన సమయంలోనో లేక కొంచెం గ్యాప్ తర్వాత కానీ ఆ సినిమాకి సంబంధించి డెఫినెట్ గా ప్రెస్ మీట్ పెట్టేవారు. కానీ ఇపుడు మహేష్ తో సినిమాకి ఇలాంటి ప్రెస్ మీట్ లు ఏవి ఉండబోవు అని తెలుస్తుంది. దీనితో జక్కన్న మొదటిసారి ఈ స్టెప్ తీసుకుంటున్నారా అనిపిస్తుంది. మరి ఇపుడు సింపుల్ గా ముహూర్త కార్యక్రమాలతో స్టార్ట్ చేసేసి నెక్స్ట్ ఎప్పుడైనా ప్రెస్ మీట్ ని పెడతారేమో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు