LCU: యూనివర్స్ లో “కూలీ”? లోకేష్ సమాధానం ఇదే


కోలీవుడ్ సినిమా దగ్గర ఇప్పుడు భారీ హైప్ లో ఉన్న కొన్ని చిత్రాల్లో యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ రాజ్ అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో చేస్తున్న మొదటి సినిమా “కూలీ” కూడా ఒకటి. మరి పాన్ ఇండియా వైడ్ గా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండగా దీనిపై భారీ హైప్ అయితే నెలకొంది. ఇక ఈ చిత్రం విషయంలో ఎప్పుడు నుంచో అందరిలో ఓ సందేహం అయితే లేకపోలేదు.

దీనితో ఈ చిత్రం కూడా లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఉంటుందా లేదా అనేది. అయితే దీనిపై రీసెంట్ ప్రెస్ మీట్ లో లోకేష్ క్లారిటీ ఇచ్చేసాడు. ఈ సినిమాకి తన ఎల్ సి యూ కి ఎలాంటి సంబంధం లేదు అని ఇది పూర్తిగా వేరే సినిమా అని తేల్చేసాడు. సో ఆ సినిమాకి తన యూనివర్స్ కి లింక్ లేదనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Exit mobile version