“వార్ 2″కి పోటీగా రజినీకాంత్!?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న భారీ చిత్రం “కూలీ” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా లోకేష్ మార్క్ సాలిడ్ మల్టీస్టారర్ గా కూడా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లో కొనసాగుతూ ఉండగా ఈ సినిమాని మేకర్స్ మొదట ఈ ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వచ్చింది.

కానీ ఇపుడు ఈ రేస్ నుంచి ఆగస్ట్ కి మార్చినట్టుగా కొత్త రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే ఆగస్టులో 14న బాలీవుడ్ భారీ మల్టీస్టారర్ “వార్ 2” కూడా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే టాలీవుడ్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి పోటీగా కూలీ వచ్చే ఛాన్స్ ఉంది అంటూ టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version