“లాల్ సలాం” ఓటిటి డేట్ ఫిక్స్ అయ్యిందా? క్లారిటీ ఇదే

“లాల్ సలాం” ఓటిటి డేట్ ఫిక్స్ అయ్యిందా? క్లారిటీ ఇదే

Published on Aug 27, 2024 4:08 PM IST

కోలీవుడ్ యంగ్ హీరోస్ విష్ణు విశాల్ అలాగే విక్రాంత్ ల కలయికలో సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ లో తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన రీసెంట్ సినిమానే “లాల్ సలాం”. అయితే ఈ చిత్రం ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో రిలీజ్ కి వచ్చింది. “జైలర్” లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వచ్చినప్పటికీ ఈ సినిమా మినిమమ్ బజ్ ని కూడా తెచ్చుకోలేక భారీ డిజాస్టర్ అయ్యింది.

మరి అక్కడ నుంచి ఈ సినిమా ఓటిటి రిలీజ్ కూడా సస్పెన్స్ గానే ఉండిపోయింది. ఈ సినిమాని అప్పట్లో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టుగా టాక్ వచ్చింది కానీ ఆ సినిమా అందులోనే కాదు ఇప్పుడు వరకు ఎందులో కూడా రిలీజ్ కాలేదు. అయితే ఇపుడు ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది క్లారిటీ వచ్చినట్టు ఒక పోస్టర్ వైరల్ అవుతుంది.

వచ్చే సెప్టెంబర్ 20న సన్ నెక్స్ట్ లో సినిమా వస్తుంది అన్నట్టుగా ఓ పోస్టర్ వైరల్ గా మారింది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు. అది కేవలం మూడో వ్యక్తులు రెడీ చేసింది తప్పితే సన్ నెక్స్ట్ వారి నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. సో లాల్ సలాం పై వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు