RC16 కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్న రామ్ చరణ్?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రం షూటింగ్ షూటింగ్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఈ చిత్రం తర్వాత హీరో రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC 16 చిత్రం ను చేయనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం కోసం రామ్ చరణ్ పూర్తిగా శరీరాకృతి ను మార్చుకొనున్నారు. స్పోర్ట్స్ డ్రామా కావడం తో సినిమా కోసం రామ్ చరణ్ ధృఢం గా కనిపించనున్నారు. అయితే ఈ పాత్ర మేకోవర్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గేమ్ చేంజర్ చిత్రం పూర్తి అయిన తర్వాత వెళ్లనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నెలలో లేదా అక్టోబర్ నెలలో RC 16 షూటింగ్ స్టార్ట్ కానుంది. దీనిపై మేకర్స్ నుండి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version