చరణ్ మాస్ ఫ్రేమ్ స్టోరీ.. వందల మంది ఎదురుగా ఒకే ఒక్కడు.. హిస్టరీ రిపీట్ చేస్తాడా!

చరణ్ మాస్ ఫ్రేమ్ స్టోరీ.. వందల మంది ఎదురుగా ఒకే ఒక్కడు.. హిస్టరీ రిపీట్ చేస్తాడా!

Published on Oct 28, 2024 8:01 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “గేమ్ ఛేంజర్”. మరి ఇండియన్ సినిమా దగ్గర టాప్ దర్శకుడు రాజమౌళి అలాగే శంకర్ లతో వర్క్ చేసిన ఏకైక హీరోగా చరణ్ అరుదైన ఘనత కూడా అందుకున్నాడు. అయితే గేమ్ ఛేంజర్ విషయంలో ఏమవుతుందా అని చాలా ఆసక్తి అందరిలో నెలకొంది.

తన మార్క్ ఫామ్ లో లేని శంకర్ మళ్ళీ ఈ సినిమా తోనే కం బ్యాక్ ఇస్తారు అని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఈ సినిమాకి చరణ్ సెంటిమెంట్ కూడా వర్క్ అవుతుంది అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే చరణ్ ట్రాక్ రికార్డు చూసినట్టు అయితే తన కెరీర్ లో కొన్ని ఎపిక్ ఎపిసోడ్స్ ఉన్నాయి.

అలా వందలాది మంది ఎదుట ఒకే ఒక్కడిగా నిలిచే సీన్స్ కి చరణ్ పర్ఫెక్ట్ ఎంపిక అన్నట్టు కనిపిస్తాడు. మరి ఇది ‘మగధీర’ నుంచి స్టార్ట్ అయ్యి మొన్న ‘RRR’ మధ్యలో ‘ధృవ’ వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ నుంచి రిలీజ్ చేసిన బ్యాక్ షాట్ పోస్టర్ కూడా వాటినే గుర్తు చేస్తుంది. దీనితో మళ్ళీ చరణ్ హిస్టరీ రిపీట్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి చూడాలి గేమ్ ఛేంజర్ తో ఆ సెంటిమెంట్ మళ్ళీ పని చేస్తుందో లేదో అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు