పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఉందా..?

Published on Jul 16, 2020 8:09 pm IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు ప్రాజెక్టులను ఒప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో మొదటి రెండు సినిమాలలో ఒకటి దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రీమేక్ చిత్రం “వకీల్ సాబ్” కాగా మరొకటి విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం కూడా ఒకటి.

వకీల్ సాబ్ చిత్రం అంతిమ దశ షూటింగ్ లో ఉండగా క్రిష్ తో తీస్తున్న ప్రాజెక్ట్ కొంత మేర షూటింగ్ అయ్యింది. అయితే ఈ రెండిట్లో ఏ సినిమా నుంచి అయినా చిన్న అప్డేట్ వచ్చినా బాగుణ్ణు అని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు, కానీ అది జరగలేదు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న బజ్ ప్రకారం వచ్చే సెప్టెంబర్ 2 వ తారీఖున పవన్ జన్మదినం కావడంతో అదే రోజున “వకీల్ సాబ్” టీజర్ ను విడుదల చేసే సూచనలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు దీనితో పాటు అదే రోజున పవన్ – క్రిష్ ల కాంబోలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని మరో వెర్షన్ వినిపిస్తుంది. వీటిలో మాత్రం వకీల్ సాబ్ టీజర్ వచ్చేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. మరి క్రిష్ కూడా ఏమన్నా ప్లాన్ చేస్తే ఆరోజు పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా గ్యారంటీ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More