ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు పూర్తి కావస్తుండగా రీసెంట్ గా వచ్చిన యాక్షన్ కట్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇక నెక్స్ట్ సినిమా ట్రైలర్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు దీనిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా ట్రైలర్ కట్ ని మేకర్స్ ఈ ఆగస్ట్ 15న రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక దీనిపై అధికారిక క్లారిటీ కూడా త్వరలోనే వస్తుందని టాక్. మరి ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా వెంకట్ ప్రభు ఈసారి ఏదో స్పెషల్ గా కుక్ చేస్తున్నాడని భావిస్తున్నారు. మరి చూడాలి ఈసారి వెంకట్ ప్రభు ఎలాంటి కాన్సెప్ట్ తో రాబోతున్నాడో అనేది. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 5న సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.