ప్రమాదంలో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ?

ప్రమాదంలో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ?

Published on Apr 8, 2025 1:59 AM IST

కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన “కాంతారా” చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్నడ లోనే కాకుండా ‘కాంతారా’ అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్లు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. మొత్తానికి రిషబ్ శెట్టి ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అయితే, రిషభ్ శెట్టికి శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉందని పంజుర్లీ వారాహి హెచ్చరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాగా మంగళూరులోని కద్రి బరేబైల్‌లో జరిగిన వార్షిక ఉత్సవానికి రిషబ్ శెట్టి హాజరై తన సమస్యను పంజుర్లీ దేవికి చెప్పారు. ‘నీకు చాలా శత్రువులున్నారు. వాళ్లు నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మిమ్మల్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటా. 5 నెలల్లో మంచి చేస్తా’ అని ఆ దేవుడు రిషబ్ శెట్టి అభయం ఇవ్వడం విశేషం. అన్నట్టు ఆ మధ్య రిషబ్ శెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే రిషబ్ శెట్టి పై కొందరు గుర్రుగా ఉన్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు