మెగాస్టార్ తో రీమేక్.. ట్రైలర్ తో ఆన్సర్ ఇచ్చిన మురుగదాస్

మెగాస్టార్ తో రీమేక్.. ట్రైలర్ తో ఆన్సర్ ఇచ్చిన మురుగదాస్

Published on Mar 23, 2025 7:00 PM IST

బాలీవుడ్ మెగాస్టార్ హీరోస్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. మరి తాను హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మురుగదాస్ తో చేస్తున్న భారీ చిత్రం “సికందర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం సల్మాన్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా విషయంలో కొన్ని అంశాలు మాత్రం కొంచెం టెన్షన్ ని కూడా మేకర్స్ అభిమానుల్లో పెట్టారు.

దీనితో ఈ చిత్రం మురుగదాస్ తెరకెక్కించిన సర్కార్ కి రీమేక్ అని చాలా కామెంట్స్ వినిపించాయి. దీనితో ఇది రీమేక్ అని కొంచెం బజ్ కూడా తక్కువ అయ్యింది. మరి దీనికి ఫైనల్ గా సమాధానం మురుగదాస్ నేడు ట్రైలర్ తో ఇచ్చారని చెప్పవచ్చు. సల్మాన్ అభిమానులకి మంచి ట్రీట్ ఇచ్చే విధంగా మాస్ మూమెంట్స్ తో ట్రైలర్ ని అదిరేలా మురుగదాస్ కట్ చేశారు.

అయితే ఇందులోనే ఈ సినిమా ఏ చిత్రానికి రీమేక్ కాదు అని స్ట్రైట్ సినిమానే అన్నట్టుగా కనిపిస్తుంది. ట్రైలర్ లో ఎక్కడా కూడా సర్కార్ తరహా షేడ్స్ కనిపించలేదు. దీనితో ఈ సినిమా మాత్రం స్ట్రైట్ సినిమానే అని ఇపుడు సల్మాన్ అభిమానులు నమ్ముతున్నారు. ఇక ఈ మార్చ్ 30న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి మరి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు