అజిత్ సినిమాలో శ్రీలీల ఎంతవరకు నిజం?

కోలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి థలా హీరోగా ఇప్పుడు రెండు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో “విడా ముయార్చి” అలాగే మరో భారీ సినిమా “గుడ్ బ్యాడ్ అగ్లీ” చేస్తున్నారు. అయితే ఈ రెండిటి షూటింగ్ ని కూడా అజిత్ చేసేస్తుండగా ఈ చిత్రాల్లో ఇప్పుడు టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల భాగం కాబోతున్నట్టు పలు రూమర్స్ అయితే ఇప్పుడు వైరల్ గా మారాయి.

అయితే ఇది ఫీమేల్ లీడ్ లోనా లేకపోతే స్పెషల్ సాంగ్ కోసమా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే మరోపక్క ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అన్నట్టు కూడా వినిపిస్తోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాని అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version