వైరల్ గా విజయ్ లేటెస్ట్ లుక్.. ఈ సినిమా కోసమేనా?

వైరల్ గా విజయ్ లేటెస్ట్ లుక్.. ఈ సినిమా కోసమేనా?

Published on Sep 6, 2024 10:00 AM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా స్నేహ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన భారీ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” (The Greatest Of All Time) నిన్ననే గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం అనుకున్న రేంజ్ హిట్ టాక్ ని సొంతం చేసుకోలేదు కానీ మిక్స్డ్ టాక్ ని అయితే తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం కోసం విజయ్ చాలా రకాల లుక్స్ ని ప్రిపేర్ చేసిన సంగతి తెలిసిందే. అవి థియేటర్స్ లో ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ ని ఇచ్చాయి.

ఇక ఈ సినిమా ఇలా రిలీజ్ అవ్వగానే విజయ్ నుంచి నయా లుక్ ఒకటి షాకింగ్ గా మారింది. మీసాలు తీసేసి కేవలం గడ్డంతోనే కనిపిస్తూ వుల్వరైన్ లుక్ లోకి తాను మారాడు. దీనితో ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ లుక్ తన నెక్స్ట్ సినిమా కోసమేనా అన్నట్టుగా ఇపుడు టాక్ నడుస్తుంది తన నెక్స్ట్ సినిమా దర్శకుడు హెచ్ వినోద్ తో ఉంటుంది అని రూమర్స్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ లుక్ ఆ సినిమా కోసమేనా అని అనిపిస్తుంది. మరి చూడాలి విజయ్ ఏ సినిమా కోసం ఇలా మారాడు అన్నది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు