“కూలీ” లో బాలీవుడ్ బిగ్ స్టార్ ఉన్నాడా?

“కూలీ” లో బాలీవుడ్ బిగ్ స్టార్ ఉన్నాడా?

Published on Aug 27, 2024 7:03 AM IST


ప్రస్తుతం కోలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కూలీ” కూడా ఒకటి. మరి అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా పూర్తవుతుండగా ఈ సినిమాలో పలువురు స్టార్స్ కూడా కనిపిస్తారని టాక్ ఉంది.

అలా రీసెంట్ గానే కింగ్ నాగార్జున సాలిడ్ క్యామియో లో కనిపించనున్నారు అని టాక్ రాగా ఇప్పుడు మరో ఊహించని బజ్ అయితే ఈ సినిమాపై వినిపిస్తుంది. దీనితో ఈ భారీ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కనిపించనున్నట్టుగా టాక్. అయితే గత కొన్ని రోజులు కితమే అమీర్ ఖాన్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుంది అని కూడా రూమర్స్ వచ్చాయి. అలాంటిది ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో కూడా ఉన్నారు అనే టాక్ మరింత కేజ్రీగా మారింది. దీనితో ఈ టాక్ అయితే నిజం కావాలని చాలా మంది ఇప్పుడు కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు