అఖిల్ స్టైలిష్ కాంబోకు ఈ స్టార్ హీరోయిన్ ఫిక్సేనా.?

అక్కినేని వారసుడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసినా ఏవి కూడా అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. కానీ మార్కెట్ పరంగా మాత్రం అఖిల్ కు సూపర్బ్ గానే ఉందని చెప్పాలి. తన ముందు సినిమాల ఫలితం కాకుండా తర్వాత కూడా మంచి ఆఫర్స్ ను దక్కించుకుంటున్నాడు.

అలా ఇప్పుడు ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్” చేస్తున్నాడు. ఇక దీని తర్వాత టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి గాను ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ ను కూడా ఎంచుకొన్నారు. అయితే ఈ సినిమాకు గాను స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా లాక్ చేశారని అప్పుడు టాక్ వచ్చింది. అలాగే ఇప్పటికీ అదే టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

Exit mobile version