War 2: “వార్ 2” తెలుగు టైటిల్ ఇదేనా?

War 2: “వార్ 2” తెలుగు టైటిల్ ఇదేనా?

Published on Oct 19, 2024 10:04 AM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర తెరకెక్కుతున్న పలు భారీ యాక్షన్ మల్టీస్టారర్ చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కలయికలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “వార్ 2” కూడా ఒకటి. బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ పై నార్త్ నుంచి సౌత్ వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా షూటింగ్ ప్లానింగ్ ప్రకారం కంప్లీట్ అవుతుండగా ఈ సినిమా టైటిల్ పై ఇంట్రెస్టింగ్ పాజిబులిటీ కనిపిస్తుంది. ఈ సినిమాకి “వార్ 2 – యుద్ధ భూమి” అనే టైటిల్ ని లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందు నుంచే హృతిక్ కూడా తారక్ తో సోషల్ మీడియా ఇంటరాక్షన్ లో యుద్ధ భూమి అంటూ ప్రస్తావించాడు. మరి హిందీ వరకు వార్ 2 గానే ఉంచి తెలుగులో “వార్ 2 – యుద్ద భూమి” గా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ చిత్రం అయితే వచ్చే ఏడాది ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు