మరి “విశ్వంభర” గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా!?

మరి “విశ్వంభర” గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా!?

Published on Aug 22, 2024 3:29 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి నేడు మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయగా దీనికి ఫ్యాన్స్ లో సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈరోజు చాలామంది సినిమా గ్లింప్స్ ని కూడా ఆశించారు. కానీ మేకర్స్ అందుకు కొంచెం సమయం ఉందంటూ మొదట ఫస్ట్ లుక్ పోస్టర్ ని మాత్రం వదిలారు.

మరి ఈ గ్లింప్స్ ఎప్పుడు విడుదల అయ్యే ఛాన్స్ ఉందో ఇప్పుడు బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ వినాయక చవితి కానుకగా ఈ సినిమా తాలూకా అవైటెడ్ గ్లింప్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ సెప్టెంబర్ మొదటి వారం లోనే విశ్వంభర విజువల్ ట్రీట్ రానుంది అని చెప్పొచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సింది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు