అట్లీ వల్లే బన్నీతో సినిమా ఆగిపోయిందా?

అట్లీ వల్లే బన్నీతో సినిమా ఆగిపోయిందా?

Published on Jun 16, 2024 7:40 PM IST

రీసెంట్ గా మన సౌత్ సినిమా దగ్గర క్రేజీ టాక్ ని సొంతం చేసుకున్న పలు క్రేజీ కాంబినేషన్ లలో అవైటెడ్ కాంబినేషన్ దర్శకుడు అట్లీ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ కూడా ఒకటి. అట్లీ మాస్ అండ్ స్టైలిష్ టేకింగ్ కి బన్నీ స్వాగ్ తోడైతే ఎలా ఉంటుందో అని చాలా మందే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాని కూడా భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని కొన్ని రూమర్స్ వచ్చాయి.

కానీ ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ లెక్కల విషయంలో ఆగిపోయింది అని మరో టాక్ వైరల్ గా మారింది. అయితే అసలు ఈ సినిమా నిలిచిపోడానికి ప్రధాన కారణం అట్లీ అనే కొన్ని వర్గాలు చెబుతున్నాయి. “జవాన్” (Jawan) సెన్సేషనల్ సక్సెస్ తో అట్లీ తన రెమ్యునరేషన్ భారీ మొత్తంలో పెంచేసాడని సుమారు తనకు ఒక్కడే 100 కోట్లు చెప్తున్నాడు అంటూ కొన్ని పుకార్లు వైరల్ అవుతున్నాయి.

అయితే తాను తెరకెక్కించిన సినిమా ఎంత 1000 కోట్లు కొట్టినా అక్కడ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అనే హీరో స్టార్డం చాలా ప్లస్ అయ్యింది. అలా వచ్చింది తప్పితే తన సినిమాకి 1000 కోట్లు వచ్చాయి కాబట్టి అట్లీ ఇంత చెప్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. మరి నిజంగానే అట్లీ అంత చెప్పాడో లేదో వారికే తెలియాలి. ప్రస్తుతానికి అయితే వీరి సినిమా ఆగిపోయిందనే అంటున్నారు. మరి దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు