విక్టరీ వెంకటేష్ చేయబోయేది హర్రరా, థ్రిల్లరా ?

Published on Sep 22, 2020 10:07 pm IST


‘ఎఫ్ 2’ చిత్రంతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఆసక్తికరమైన సినిమాలను లైన్లో పెట్టుకుని ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ సినిమా ‘అసురన్’ను తెలుగులో ‘నారప్ప’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. 60 శాతం వరకు షూటింగ్ ముగిసిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా నిలిచి ఉంది. త్వరలోనే చిత్రీకరణ రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ‘ఎఫ్ 2’కు సీక్వెల్ ‘ఎఫ్ 3’ కూడ సెట్టైంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ రెండు కాకుండా వెంకీ మరొక చిత్రాన్ని కూడ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం రెగ్యలర్ కమర్షియల్ స్టోరీలా కాకుండా భిన్నంగా ఉంటుందట.

ఈ చిత్రాని తమిళ దర్శకుడు మిలింద్ రావ్ డైరెక్ట్ చేస్తారని భోగట్టా. మిలింద్ రావ్ తమిళ దర్శకుడు. ఆయన డైరెక్ట్ చేసిన ‘అవల్’ చిత్రం తెలుగులో ‘గృహం’ పేరుతో విడుదలైంది. ఈయన రానాతో ఒక చిత్రం చేయనున్నారని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఈ చిత్రం సూపర్ నాచ్యురల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందే వెంకీతో ఒక సినిమా ఉంటుందని గుసగుసలు ఊపందుకున్నాయి. మిలింద్ రావ్ వెంకీకి ఒక లైన్ చెప్పారని, అది నచ్చి వెంకీ వెంటనే ఒకే చెప్పి, పూర్తి స్క్రిప్ట్ వర్క్ చేసుకుని రమ్మన్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది, ఒకవేళ నిజమైతే మిలింద్ వెంకీతో హర్రర్ సినిమా తీస్తారా లేకపోతే థ్రిల్లర్ తెరకెక్కిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More