“తంగలాన్” రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్.!

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా మాళవిక మోహనన్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “తంగలాన్” కోసం అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో జస్ట్ టీజర్ తోనే ఓ రేంజ్ సెన్సేషన్ ని సెట్ చేసిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఇదే అని చెప్పాలి.

టీజర్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ బజ్ ఈ చిత్రానికి వచ్చేసింది. అలాగే మన తెలుగు ఆడియెన్స్ కూడా ఈ సినిమా పట్ల చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో జనవరిలో రావాల్సింది కానీ అలా వాయిదా పడుతూ వచ్చి అసలు ఇంకెప్పుడు రిలీజ్ అనే స్టేజి కి వచ్చేసింది.

అయితే ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ ప్రోగ్రెస్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా ఆగస్ట్ 15 రిలీజ్ కి రావచ్చని వినిపిస్తుంది. ఈ డేట్ లో ఇది వరకు “పుష్ప 2” సంగతి తెలిసిందే. ఈ డేట్ లో నుంచి ఆ సినిమా తప్పుకోవడంతో చాలా సినిమాలు ఈ డేట్ పై కన్నేశాయి. మరి ఈ డేట్ లో అయితే ఇప్పుడు తంగలాన్ కూడా కర్చీఫ్ వేసినట్టుగా వినిపిస్తుంది. మరి చూడాలి ఏమవుతుంది అనేది.

Exit mobile version