డిజప్పాయింట్ చేసిన యష్ బర్త్ డే ట్రీట్!?

డిజప్పాయింట్ చేసిన యష్ బర్త్ డే ట్రీట్!?

Published on Jan 8, 2025 12:00 PM IST

ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫేమ్ ఉన్న హీరోస్ లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా ఒకరు. తన సెన్సేషనల్ హిట్ చిత్రాలు “కేజీయఫ్” సిరీస్ తో అదరగొట్టగా ఆ సినిమాలు ఇచ్చిన ఫేమ్ తర్వాత తాను ఎలాంటి సినిమా చేస్తాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కేజీయఫ్ తో వచ్చిన స్టార్డంని నిలబెట్టుకోగలడా లేదా అనేది ఆసక్తిగా మారిన సమయంలో మళయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో అనౌన్స్ చేసిన సినిమానే “టాక్సిక్”.

మరి అనౌన్సమెంట్ తోనే మంచి హైప్ ని అందుకున్న ఈ చిత్రం నుంచి నేడు యష్ పుట్టినరోజు కానుకగా చిన్న గ్లింప్స్ ని మేకర్స్ వదిలారు. మరి ఈ గ్లింప్స్ లో యష్ నుంచి కొత్త వెర్షన్ కన్పిస్తుండగా తనలోని కంప్లీట్ రొమాన్స్ యాంగిల్ కనిపిస్తుంది. అలాగే మ్యూజిక్ కూడా బాగానే ఉంది కానీ మేకర్స్ ఇచ్చిన హైప్ ని అభిమానులు ఏదో ఊహించుకుంటే వీరు ఇంకేదో వదిలారు అనే కామెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి. దీనితో యష్ బర్త్ డే ట్రీట్ మాత్రం డిజప్పాయింటింగ్ గా మిక్స్డ్ రెస్పాన్స్ నే అందుకుంది అని చెప్పాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు