విడుదలకు సిద్ధమవుతున్న ఇష్క్

విడుదలకు సిద్ధమవుతున్న ఇష్క్

Published on Jan 31, 2012 2:12 AM IST


నితిన్ మరియు నిత్య మీనన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి మూడవ వారంలో విడుదలకు సిద్ధమవుతుంది. ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రానికి విక్రమ్ దర్శకుడు కాగా శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై విక్రమ్ గౌడ్ నిర్మిస్తున్నారు. ఇష్క్ చిత్రం హై టెక్నికల్ వాల్యూస్ తో రూపుదిద్దుకుంటుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ఈ సినిమాకి పనిచేస్తుండటం విశేషం. అనుప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఫిబ్రవరి 2న విడుదల కాబోతున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు