సమీక్ష : ఇస్మార్ట్ శంకర్ – మాస్ కి మాత్రమే !

సమీక్ష : ఇస్మార్ట్ శంకర్ – మాస్ కి మాత్రమే !

Published on Jul 19, 2019 3:02 AM IST
iSmart Shankar movie review

విడుదల తేదీ : జూలై 18, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  3/5

నటీనటులు : రామ్ పోతినేని,నిధి అగర్వాల్,నభా నటేష్,షాయాజీ షిండే,ఆశిష్ విద్యార్థి

దర్శకత్వం : పూరి జగన్నాధ్

నిర్మాత‌లు : ఛార్మి,పూరి జగన్నాధ్

సంగీతం : మణిశర్మ

సినిమాటోగ్రఫర్ : రాజ్ తోట

ఎడిటర్ : జునైద్ సిద్దిఖీ

హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనెర్ ‘ఇస్మార్ట్ శంకర్’. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

ఇస్మార్ట్ శంకర్ (రామ్) పక్కా రౌడీ. ఓ హత్య చేస్తే.. తన లైఫ్ సెట్ అయిపోతుందని.. కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు. అయితే ఈ క్రమంలో చాందిని (న‌భా న‌టేష్ )తో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్ తో కలిసి అండర్ గ్రౌండ్ లో వెళ్ళే క్రమంలో రామ్ పై పోలీస్ గ్యాంగ్ ఎటాక్ చేస్తోంది. ఆ ఎటాక్ లో న‌భా న‌టేష్ చనిపోతుంది. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) మెమొరీను ఎక్కిస్తారు. అసలు అరుణ్ మెమొరీని, రామ్ తలలోకే ఎక్కించడానికి కారణం ఏమిటి ? దీనికి సారా (నిధి అగర్వాల్)కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ రామ్ తాను చంపాలనుకున్న వ్యక్తిని చంపుతాడా ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాకి వచ్చినంత హైప్, ఈ మధ్య కాలంలో పూరి సినిమాల్లో దేనికి రాలేదు. మరి భారీ అంచనాల మధ్య పక్కా మాస్ మసాలా అంశాలతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మొత్తానికి మాస్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటుంది. అలాగే పక్కా తెలంగాణ యాసలో కొత్తగా ఉన్న సంభాషణలు, అలాగే రామ్ డైలాగ్ డెలివరీ, మరియు ఫుల్ ఎనర్జీతో సాగే రామ్ యాక్టింగ్ అండ్ స్టెప్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ముఖ్యంగా ఈ సినిమా కోసం రామ్ పెట్టిన ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఈ క్యారెక్టర్‌ లో రామ్ చక్కని నటనను కనబరిచాడు. గత సినిమాల్లో కంటే, ఈ సినిమాలో రామ్ నటన చాల కొత్తగా ఉంటుంది. మెయిన్ గా సినిమాలో అక్కడక్కడా నవ్విస్తూనే, ఇటు హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక రామ్ సరసన హీరోయిన్స్ గా నటించిన నభా నటేష్ అండ్ నిధి అగర్వాల్ తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో మరియు తమ గ్లామర్ తో బాగా అలరించారు. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో మరియు కొన్ని ప్రేమ సన్నివేశాల్లో రామ్ – నభా మధ్య కెమిస్ట్రీ బాగా అలరిస్తుంది. మొత్తానికి సినిమాలో ‘ఇస్మార్ట్ శంకర్’ పాత్ర పేలింది. అలాగే ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్, మణిశర్మ మ్యూజిక్ మాస్ ప్రేక్షకులకు నచ్చుతాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

పూరి మంచి స్టోరీ లైన్ ను అలాగే ఇస్మార్ట్ శంకర్ అనే మంచి క్యారెక్టర్ ను రాసుకున్నప్పటికీ, ఆ లైన్ ను ఆ క్యారెక్టర్ కి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో యూత్ ని ఎట్రాక్ట్ చేసే క్రమంలో ప్రతి సన్నివేశంలో అవసరం ఉన్నా లేకపోయినా బూతులు ఇరికించి పెట్టడం కొంత ఇబ్బందిగా అనిపిస్తోంది. పైగా సెకెండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరి స్లోగా సాగుతాయి.

ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ప్రేమలో పడే సన్నివేశాలను బాగా రాసుకున్న దర్శకుడు, సెకెండ్ హాఫ్ లో లవ్ సీన్స్ ను ఆ స్థాయిలో రాసుకోలేదు. సినిమాలో కీలక సన్నివేశాలకు సరైనా లాజిక్ ఉండడు. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా అసలు కనెక్ట్ కాదు. ఇక మెయిన్ పాయింట్ ఆధారంగా క్లైమాక్స్ లో ఆ పాయింట్ కి తగ్గ స్థాయిలోనే సరైన ముగింపు ఇచ్చి ఉంటే బాగుండేది. అలాగే మెమొరీ మార్చే సీక్వెన్స్ ను దర్శకుడు ఇంకా బలంగా రాసుకోవాల్సింది.

 

సాంకేతిక విభాగం :

 

ఈ సినిమాలో సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్ గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు. మణిశర్మ తన నేపధ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అలాగే సినిమా నేపధ్యానికి తగ్గట్లుగా, సినిమాలో వచ్చే పరిస్థితులకు తగట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు. ఎడిటర్ సినిమాను ఇంకా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాతలు పూరి – ఛార్మి ల నిర్మాణ విలువులు బాగున్నాయి.

 

తీర్పు :

 

హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్ గా వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాల పరంగా బాగానే ఆకట్టుకున్నా.. సినిమా మాత్రం పూర్తిస్థాయిలో ఆసక్తికరంగా సాగలేదు. కథనం రొటీన్ గా సింపుల్ గా ఉండటం, సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ కు సరైన లాజిక్స్ లేకపోవడం, సినిమాలో డబుల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం, సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణను పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే రామ్ హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు మరియు రామ్ – నభా మధ్య కెమిస్ట్రీ.. ప్రేక్షకులను అలరిస్తాయి. ఓవరాల్ గా ఇస్మార్ట్ శంకర్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అయితే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు జస్ట్ ఓకే సినిమా అనిపిస్తోంది.

123telugu.com Rating :   3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు