లేటెస్ట్ : ‘గాడ్ ఫాదర్’ నుండి ఐటెం సాంగ్ రిలీజ్

Published on Oct 5, 2022 3:15 am IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన తాజా పొలిటికల్ యాక్షన్ కమర్షియల్ సినిమా గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని మోహన్ రాజా తెరకెక్కించగా నయనతార, సునీల్, సత్యదేవ్, మురళి శర్మ, సముద్రఖని తదితరులు ఇందులో కీలక రోల్స్ చేసారు. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ మూవీ నుండి మాస్ బీట్ నెంబర్ అయిన బ్లాస్ట్ బేబీ అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ వీడియోని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్. థమన్ అందించిన మంచి మాస్ బీట్ కి రామజోగయ్య శాస్త్రి ఆకట్టుకునే లిరిక్స్ రాయగా, దామిని భట్ల, బ్లెజ్ ఇద్దరూ ఎంతో అద్భుతంగా ఆలపించారు. మాస్ ని, యూత్ ని ఆకట్టుకుంటూ ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. కాగా రేపు భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో గాడ్ ఫాదర్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :