ఆ దర్శకుడికి ఇప్పట్లో స్టార్ హీరో దొరకడం కష్టమే..!

Published on Aug 5, 2020 3:00 am IST


కెరీర్ బిగినింగ్ నుండి డైరెక్టర్ సురేంధర్ రెడ్డి స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. మొదటి చిత్రం మినహాయిస్తే ఆయన చేసినవన్నీ స్టార్ హీరోల చిత్రాలే. మహేష్, ఎన్టీఆర్, చిరంజీవి మరియు చరణ్ వంటి స్టార్ హీరోలతో ఆయన చిత్రాలు చేశారు. కాగా గత ఏడాది ఆయన చిరంజీవితో సైరా అనే భారీ పాన్ ఇండియా చిత్రం చేశారు. ఆ మూవీ టాలీవుడ్ హైయెస్ట్ గ్రాస్సింగ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

ఐతే ఆ మూవీ తరువాత ఇంత వరకు ఆయన కొత్త మూవీ ప్రకటించలేదు. హీరో రామ్ తో సురేంధర్ రెడ్డి మూవీ చేస్తున్నారని వార్తలు వస్తున్నా, అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలందరూ రెండు మూడు సినిమాలు ప్రకటించి బిజీగా ఉన్నారు. చరణ్ మినహాయిస్తే మరో రెండు మూడేళ్ళ వరకు ఒక్క స్టార్ హీరో కూడా ఖాళీగా లేరు. దీనితో ఈ సారి సురేంధర్ రెడ్డి కి స్టార్ హీరో దొరకడం కష్టమే అన్న మాట వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More