ఆఫీసియల్ – “RRR” తమిళ్ హక్కులను దక్కించుకుంది వీరే!

ఆఫీసియల్ – “RRR” తమిళ్ హక్కులను దక్కించుకుంది వీరే!

Published on Feb 17, 2021 5:00 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ మరియు హై ఎండ్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం”. పాన్ ఇండియన్ లెవెల్లో ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. మరి అలాగే గత కొన్నాళ్ల నుంచి ఈ చిత్రం తాలూకా బిజినెస్ పై రచ్చ నడుస్తూనే ఉంది.

అలా తమిళ్ హక్కులకు సంబంధించి అక్కడి బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు ఈ హక్కులు కొనుగోలు చేసారని టాక్ వచ్చింది. మరి దీనిపైనే వారు కూడా ఈరోజు ఓ భారీ అనౌన్సమెంట్ ఉందని కన్ఫర్మ్ చేశారు. వారు చెప్పినట్టుగా అంతా ఊహించినట్టుగానే తాము ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం తమిళ్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నామని క్లారిటీ ఇచ్చారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ భారీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే అక్టోబర్ 13న విడుదలకు రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు