సమీక్ష : జాబిలమ్మ నీకు అంత కోపమా – యూత్ ని మెప్పించే రోమ్ కామ్ డ్రామా

సమీక్ష : జాబిలమ్మ నీకు అంత కోపమా – యూత్ ని మెప్పించే రోమ్ కామ్ డ్రామా

Published on Feb 22, 2025 3:04 AM IST

 jaabilamma neeku antha kopama Movie Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 21, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : పవీష్ నారాయణన్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాత్యు థామస్, శరత్ కుమార్, రబియా ఖాతూన్, రమ్య రంగనాథన్, శరణ్య పొనవన్నన్.
దర్శకుడు : ధనుష్
నిర్మాత : కస్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా
సంగీతం :జివి ప్రకాష్
ఛాయాగ్రహణం :లియోన్ బ్రిట్టో
కూర్పు :జి కె ప్రసన్న

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మన తెలుగు సినిమాలతో పాటుగా డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. మరి వీటిలో కోలీవుడ్ స్టార్ ధనుష్ దర్శకత్వం వహించిన యూత్ డ్రామా “జాబిలమ్మ నీకు అంత కోపమా” కూడా ఒకటి. మరి ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తుందో లేదో సమీక్షలో చూద్దాం.

కథ:

లైఫ్ లో చెఫ్ అవుదామనుకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యువకుడు ప్రభు(పవీష్ నారాయణ్) బాగా ధనవంతురాలైన తన ఫస్ట్ లవ్ నీలా(అనికా సురేంద్రన్) తో బ్రేకప్ తర్వాత ఎన్నో పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండిపోతాడు. కానీ తన స్కూల్ ఫ్రెండ్ ప్రీతీ(ప్రియా ప్రకాష్ వారియర్) పెళ్లి కూతురుగా తనకి సంబంధం వస్తుంది. అయితే తన మాజీ ప్రేయసిని మర్చిపోలేని సమయంలో ఆమె పెళ్లి శుభలేఖ ప్రభుకి వస్తుంది. మరి చూసి తాను తీసుకున్న నిర్ణయం ఏంటి? వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు? పెళ్లి ఎవరితో ఎవరికి అయ్యింది? నీలా అసలు నిజం తెలుసుకుందా లేదా అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో యువతని అలరించే అంశాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు. దర్శకుడు ధనుష్ మంచి టేకింగ్ తో యువతని ఆకట్టుకునే ప్రయాత్నం చేసాడని చెప్పాలి. ప్రేమ కథ పరంగానే కాకుండా ఫ్రెండ్షిప్ లాంటి బ్యూటిఫుల్ ఎమోషన్ ని కూడా ధనుష్ బాగా క్యారీ చేసారని చెప్పాలి. సినిమాలో అక్కడక్కడా వచ్చే కామెడి సీన్స్ సాలిడ్ గా వర్కౌట్ అవుతాయి.

అలాగే సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు మన తెలుగు ఆడియెన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా కట్ చెయ్యడం బాగుంది. అలాగే ఇంకొన్ని సన్నివేశాల్లో అయితే ధనుష్ మాస్ మార్క్ అలా కనిపిస్తుంది. వీటిని తన ఫ్యాన్స్ పక్కా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ గా హీరోకి శరత్ కుమార్ నడుమ కొన్ని సీన్స్ అయితే ధనుష్ రఘువరన్ బీటెక్ టైప్ మాస్ సీన్స్ ని తలపిస్తాయి. వీటిని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు.

అలాగే ఫ్రెండ్షిప్, లవ్, బ్రేకప్ లాంటి వాటి మీద కొన్ని సీన్స్ మంచి హైలైట్ అయ్యాయని చెప్పవచ్చు. ఇక నటీనటుల్లో మెయిన్ లీడ్ పవీష్ మంచి నటన కనబరిచాడు. మెయిన్ గా సింగిల్ టేక్స్ సునాయాసంగా చేయడం ఇంప్రెస్ చేస్తుంది. తన డైలాగ్ డెలివరీ, మెయిన్ గా డాన్స్ మూమెంట్స్ ని చాలా ఈజ్ తో చేసాడు. ఇక యంగ్ హీరోయిన్ అనికా కూడా బ్యూటిఫుల్ గా కనిపించింది. అలాగే తన రోల్ కూడా సినిమాలో బాగుంది.

ఇంకా వీరితో పాటుగా పవీష్ ఫ్రెండ్ గా నటించిన యువ నటుడు మాత్యు థామస్ కామెడీ రోల్ లో అదరగొట్టేసాడని చెప్పాలి. ఇంకా రమ్య రంగనాథన్ సినిమాలో బ్యూటిఫుల్ గా కనిపించింది. ఉన్న కొంతసేపు కోడోత్ ఆడియెన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక వీరితో పాటుగా సీనియర్ నటులు శరణ్య పోనవన్నన్, ఆడుకాలం నరేన్, శరత్ కుమార్ లు తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి రక్తి కట్టించారు. ఇక వీరితో పాటుగా స్పెషల్ అపీరెన్స్ ఇచ్చిన ప్రియా వారియర్, ప్రియాంక అరుళ్ మోహన్ లు కూడా ప్లస్ అయ్యారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో పెద్దగా బలమైన కథేమీ కనిపించదు. చాలా రొటీన్ లైన్ నే ధనుష్ ఎంచుకున్నారు. అలాగే కథనం కూడా మరీ అంత ఆసక్తిగా అనిపించదు. ఉన్నంతలో పెద్దగా బోర్ అనేది కొట్టనివ్వకుండా కొనసాగించడం మూలాన సేవ్ అయ్యిందని చెప్పవచ్చు.

అలాగే చాలా సీన్స్ ఒకింత రొటీన్ గా ఇది వరకే చూసేసిన చాలా రోమ్ కామ్ డ్రామాల తరహాలోనే అనిపిస్తాయి. సో మరీ కొత్తదనం ఆశిస్తే ఈ సినిమా విషయంలో డిజప్పాయింట్ కావచ్చు. ఇక వీటితో పాటుగా జివి ప్రకాష్ మ్యూజిక్ కూడా సినిమాలో అంత ఎఫెక్టీవ్ గా లేదు. తన స్కోర్ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది.

ఇంకా మెయిన్ లీడ్ ఇద్దరూ కూడా కొన్ని సన్నివేశాల్లో తమ ఏజ్ కి తగ్గట్టుగా బాగానే కనిపిస్తారు కానీ కొన్ని కీలక ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం నటన పరంగా ఇంకా మెరుగ్గా చేయాల్సింది. అనికాపై ఆమె నిజం తెలుసుకున్న సన్నివేశంలో తన పెర్ఫామెన్స్ ఒకింత అసహజంగా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమా నిర్మాణ విలువలు బ్రిలియెంట్ అని చెప్పవచ్చు. దర్శకుడు ధనుష్ టెక్నికల్ పరంగా సినిమాని సాలిడ్ గా ప్రెజెంట్ చేశారు. మెయిన్ గా కొన్ని పాటల్లో వినూత్నత, సెట్టింగ్స్ ఇంప్రెస్ చేస్తాయి. నిర్మాణం పరంగా మాత్రం మేకర్స్ ఎక్కడా తగ్గలేదు. టెక్నికల్ టీమ్ లో జివి ప్రకాష్ స్కోర్ రొటీన్ గానే ఉంది. పాటలు కొన్ని పర్వాలేదు. లియోన్ బ్రిట్టో విజువల్స్ బాగున్నాయి. ప్రసన్న జికె ఎడిటింగ్ కూడా జస్ట్ ఓకే.

ఇక దర్శకుడు ధనుష్ విషయానికి వస్తే.. తన నుంచి లాస్ట్ గా వచ్చిన రాయన్ లో కూడా బలమైన కథ లేదు కానీ ట్రీట్మెంట్ సేవ్ చేస్తుంది అని చెప్పవచ్చు. మరి సరిగ్గా ఇదే జాబిలమ్మ నీకు అంత కోపమా కి కూడా జరిగింది అని చెప్పవచ్చు. రొటీన్ లవ్ స్టోరీనే తీసుకున్నప్పటికీ దానిని పెద్దగా బోర్ లేకుండా ధనుష్ తెరకెక్కించడం బాగుంది. అలాగే చాలా సీన్స్ ని తాను బాగా యువతకి కనెక్ట్ అయ్యేవిధంగా రాసుకున్నారు. ఓవరాల్ గా తన వర్క్ బాగానే ఉంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “జాబిలమ్మ నీకు అంత కోపమా” చిత్రం రొటీన్ గానే ఉన్నా అలరించే రోమ్ కామ్ డ్రామా అని చెప్పవచ్చు. ధనుష్ సింపుల్ లైన్ నే తీసుకున్నారు కానీ యువతని అలరించే స్క్రీన్ ప్లేతో సినిమాని నడిపించడం యువతని ఎంగేజ్ అయ్యేలా చేస్తుంది. ఆ రొటీన్ ప్లే పక్కన పెడితే ఈ చిత్రాన్ని ఈ వారాంతంలో యువత ఎంజాయ్ చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు