శర్వానంద్ సమంత జంటగా దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ జాను గత వారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తమిళ క్లాసిక్ 96కి తెలుగు రీమేక్ గా వచ్చిన జాను వసూళ్లు మాత్రం చాలా నిరాశజనకంగా కొనసాగుతున్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోలుకొనే పరిస్థితి కనిపించడం లేదు. వీకెండ్ డేస్ లో కూడా జాను చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టలేకపోయింది. మరో మూడు రోజులలో కొత్త సినిమాల విడుదల నేపథ్యంలో మరింత వసూళ్లు తగ్గిపోయే అవకాశం కలదు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా, 96 మూవీకి సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత్ స్వరాలు సమకూర్చారు. స్కూల్ డేస్ లో ప్రేమించుకొని విడిపోయిన ఓ జంట చాలా కాలం తరువాత కలిస్తే వారి మధ్య నడిచే ఎమోషన్ జర్నీ ప్రధానాశంగా జాను తెరకెక్కింది.