తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ’96’ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ కోసం తెలుగులో శర్వానంద్, సమంతలు జోడీ కట్టారు. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. కాగా నిన్న రిలీజ్ అయిన జాను ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా వైరల్ అయింది. సినిమా పై బాగానే అంచనాలను పెంచింది. అయితే తాజాగా ఈ చిత్రం టీజర్ రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోతుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేసింది.
ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా డిఫరెంట్ గా ఉంది ఎడారిలో వెళ్తున్న నాలుగు ఒంటెలు.. వాటికీ ఎదురుగా శర్వానంద్.. మొత్తానికి పోస్టర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. మరి టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో సినిమా విడుదలని కన్ఫర్మ్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు.
The season of love begins tomorrow! Teaser of #Sharwanand & @Samanthaprabhu2-starrer #Jaanu at 5pm on January 9th! #JaanuTeaser @SVC_Official #PremKumar @Govind_Vasantha #JMahendran @CinemaInMyGenes #SVC34 pic.twitter.com/QJ01MMZsRl
— Sri Venkateswara Creations (@SVC_official) January 8, 2020