సెన్సార్ ముగించుకున్న ‘జాట్’

సెన్సార్ ముగించుకున్న ‘జాట్’

Published on Apr 9, 2025 2:00 AM IST

బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జాట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై సౌత్‌లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను పెంచాయి.

ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో మాస్ వర్గాలకు ఇది పూర్తి ట్రీట్ ఇవ్వనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

రణ్‌దీప్ హుడా, రెజీనా కాసాండ్రా, వినీత్ కుమార్ సింగ్, సయ్యామీ ఖేర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు