టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో సందడి చేయనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు ఓ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్న ‘జాట్’ చిత్ర టీజర్‌ను ‘పుష్ప-2’ మూవీకి అటాచ్ చేసి ప్రదర్శించబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా వెల్లడించింది.
దీంతో మాస్ లవర్స్‌కి ఇది మరింత మాసివ్ ట్రీట్ కానుందని చిత్ర నిర్మాతలు ఆశిస్తున్నారు. ఇక ఈ ‘జాట్’ సినిమాలో రెజీనా క్యాసాండ్రా, సయ్యామీ ఖేర్ ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు.
The Grandest teaser launch for #JAAT ????
Witness the MASSIVE #JaatTeaser in 12,500+ screens worldwide exclusively with #Pushpa2TheRule
Enjoy the glimpse of the MASS FEAST on the big screens ❤????
Starring Action Superstar @iamsunnydeol
Produced by @MythriOfficial &… pic.twitter.com/JhzHEqImGU— Gopichandh Malineni (@megopichand) December 4, 2024