బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జాట్’ను తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేడి డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
అయితే ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తారని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ, తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘జాట్’ ఇప్పటికైతే హిందీలో మాత్రమే రిలీజ్ కానుందట. ఈ చిత్రాన్ని వీక్షించిన సన్నీ డియోల్ కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేయాలని సూచించారట.
అంతేగాక, జాట్ చిత్ర తెలుగు డబ్బింగ్ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. రిలీజ్‌కు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం కుదరకపోవచ్చని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రణ్‌దీప్ హుడా, రెజినీ కాసాండ్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.