బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జాట్’ను టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై మొదట్నుంచి మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్‌ప్యాక్డ్ యాక్షన్‌తో అదిరిపోయింది. బాలీవుడ్ చిత్రం అయినప్పటికీ, ఇందులోని యాక్షన్ మన తెలుగు సినిమాల్లో కనిపించే మాదిరిగా ఉండటంతో ఇక్కడి ప్రేక్షకులకు ఇది ఇట్టే కనెక్ట్ అవుతుంది. ఇక ఓ దుర్మార్గుడు ఏలే లంకను తగలబెట్టేందుకు వచ్చిన హీరో కథే ఈ సినిమా అని మనకు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సన్నీ డియోల్ యాక్షన్ డోస్‌తో తన పంజా పవర్ ఏమిటో మరోసారి ప్రేక్షకులు చూపెట్టేందుకు రెడీ అయ్యాడు. అయితే, ఇప్పటికే నార్త్‌కు తన పంజా పవర్ తెలుసని.. ఇప్పుడు సౌత్ వాళ్లు కూడా తన పంజా పవర్ ఏమిటో చూస్తారంటూ ఆయనతో డైలాగ్ చెప్పించిన తీరు ఆకట్టుకుంటుంది.
అటు రణతుంగ పాత్రలో రణ్‌దీప్ హుడా పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక వీరిద్దరు ఎదురుపడినప్పుడు ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్‌లు చూస్తామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో వినీత్ కుమార్ సింగ్, రెజీనా కాసాండ్రా, సయ్యామి ఖేర్, స్వరూపా ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సాలిడ్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి