‘జాక్’ ట్రైలర్.. రేపటికి వాయిదా!

‘జాక్’ ట్రైలర్.. రేపటికి వాయిదా!

Published on Apr 2, 2025 8:00 PM IST

స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా నుంచి నేడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.

3 నిమిషాల 6 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం మ్యాడ్‌నెస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ప్రచారం చేసింది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ట్రైలర్ రిలీజ్‌ను రేపటికి(ఏప్రిల 3) వాయిదా వేశామని.. ఈ ట్రైలర్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో.. అందుకు తగ్గట్టుగానే ఇందులో ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక ఈ సినిమాలో సిద్ధు స్టైలిష్ లుక్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందాల భామ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను SVCC బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు