‘మదగజ’ పూర్తి చేసిన జగపతి బాబు !

Published on Oct 25, 2020 5:47 pm IST

ఫ్యామిలీ హీరో నుండి విలన్ గా మారక జగపతి బాబుకు, తెలుగుతో పాటు తమిళ కన్నడ చిత్ర పరిశ్రమల నుండి కూడా కీలక పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీమురళి ‘మదగజ’ అనే కన్నడ సినిమాలో కూడా నటిస్తోన్న జగ్గు భాయ్, పూర్తి నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. కాగా మైసూరులో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘మదగజ’ షూట్ లో పాల్గొన్న జగపతి బాబు నేటితో తన పార్ట్ కు సంబందించిన షూట్ ను పూర్తి చేశాడట.

కాగా జగపతి బాబు ఈ మధ్య కన్నడ సినిమాలు కూడా ఎక్కువుగా చేస్తున్నాడు. అందుకే ఇప్పుడిప్పుడే కన్నడ భాషను కూడా నేర్చుకుంటున్నాడట . ఈ క్రమంలోనే దర్శన్ ‘రాబర్ట్‌’ మూవీతో స్వయంగా కన్నడలో డబ్బింగ్ కూడా చెప్పబోతున్నాడు. ఇక మదగజ హీరో శ్రీమురళి గురించి జగపతిబాబు మాట్లాడుతూ.. ‘తను చాల స్వీట్ పర్సన్. ప్రస్తుతం మదగజ చిత్రం షూటింగ్ పూర్తిస్థాయిలో శరవేగంగా జరుగుతోందని తెలిపారు.

సంబంధిత సమాచారం :

More