“చరణ్ 16″పై జగ్గూభాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

“చరణ్ 16″పై జగ్గూభాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Published on Jan 16, 2025 12:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “గేమ్ ఛేంజర్” తర్వాత మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ 16వ సినిమాగా దర్శకుడు బుచ్చిబాబు సానాతో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి మళ్ళీ సుకుమార్ కాంపౌండ్ నుంచే ఉన్న టీం తో ఈ సినిమా చేస్తుండడంతో పాజిటివ్ వైబ్స్ కూడా ఉన్నాయి.

అయితే గతంలో సుకుమార్, చరణ్ కలయికలో వచ్చిన “రంగస్థలం” నటుడు జగపతిబాబు ఈ చిత్రంలో కూడా సాలిడ్ రోల్ చేస్తుండగా తాను లేటెస్ట్ పెట్టిన పోస్ట్ మంచి ఆసక్తిగా మారింది. చాలా కాలం తర్వాత తనకి మంచి పెట్టాడు బుచ్చిబాబు సానా. చరణ్ 16లో తన గెటప్ చూసాక చాలా తృప్తిగా అనిపించింది అంటూ తన మేకప్ రూమ్ నుంచి వీడియోతో పోస్ట్ చేశారు. దీనితో మళ్ళీ తన నుంచి చరణ్ సినిమాలో ఒక సాలిడ్ రోల్ రాబోతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు