కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
జైలర్ చిత్రానికి వచ్చిన ట్రెమెండస్ రెస్పాన్స్‌తో ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని మేకర్స్ గతంలో వెల్లడించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను తాజాగా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ‘జైలర్ 2’ చిత్రాన్ని మొదటి భాగాని కంటే రెట్టింపు అంచనాలతో చిత్రీకరించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇక ఈ అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా మేకర్స్ ఆసక్తికరంగా కట్ చేయడంతో ఈ మూవీపై అప్పుడే అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాతో మరోసారి రజినీకాంత్ బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.