ఆస్కార్ బరిలో భారతీయ చిత్రం

ఆస్కార్ బరిలో భారతీయ చిత్రం

Published on Nov 25, 2020 6:21 PM IST

2021 ఆస్కార్ బరిలో మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ నిలిచింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం భారత్ తరపున ఎంట్రీ సాధించింది. ఫ్లిల్మ్ మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. అన్ని భారతీయ భాషల్లో కలిపి మొత్తం 27 సినిమాలు పోటీపడగా ‘జల్లికట్టు’ ఎంపికైంది. ఈ చిత్రాన్ని లిజో జోస్ పెలిస్సెరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఆంటోని వర్గీస్‌, చెంబన్‌ వినోద్‌ జోసే, సబుమోన్‌ అబ్దుసామద్‌ శాంతి బాల చంద్రన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ చిత్రాన్నే ప్రత్యేకంగా ఎంపిక చేయడం గురించి వివరించిన రాహుల్ రానైర్ సినిమా ప్రొడక్షన్ క్వాలిటీ, పెలిస్సెరి దర్శకత్వాన్ని ప్రసంశించారు. మనుషుల్లోని కఠినమైన కోణాన్ని బయటకు తీసి జంతువుల కంటే మనుషుల ఆలోచనలు భయంకరంగా ఉంటాయని చెప్పారని, సన్నివేశాలను గొప్పగా తెరకెక్కించారని అందుకే సినిమాను ఎంపిక చేశామని చెప్పుకొచ్చారు. మలయాళంలో మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఓటీటీ ద్వారా తెలుగులో కూడ డబ్ అయింది. బీఫ్ మాంసాన్ని ఎక్కువగా ఇష్టపడే ప్రజల నుండి తప్పించుకున్న అడవి దున్న సృష్టించిన భీభత్సమే ఈ సినిమా కథాంశం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు