విడుదల తేదీ : అక్టోబర్ 12, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : సుహాస్, సంగీర్థన, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గోపరాజు రమణ తదితరులు.
దర్శకుడు : సందీప్ రెడ్డి బండ్ల
నిర్మాతలు : దిల్ రాజు, హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి
సంగీత దర్శకుడు : విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్
సంబంధిత లింక్స్: ట్రైలర్
నటుడు సుహాస్ హీరోగా వచ్చిన సినిమా ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.
కథ :
ప్రసాద్ (సుహాస్) సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. తన భార్య (సంగీర్థన విపిన్) తో అతి సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కానీ, వీరిద్దరూ చాలా సంతోషంగా చాలా అన్యోన్యంగా ఉంటారు. అయితే, పిల్లల్ని మాత్రం కనకూడదు అని ప్రసాద్ కఠినంగా నిర్ణయం తీసుకుంటాడు. బెస్ట్ లైఫ్ ఇవ్వలేనప్పుడు పిల్లలను కనకూడదు అనేది ప్రసాద్ అభిప్రాయం. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ప్రసాద్ భార్య నెల తప్పుతుంది. దీనికి ప్రధాన కారణం తాను కుటుంబ నియంత్ర కోసం వాడుతున్న కండోమ్ సరిగ్గా పని చేయలేదని ప్రసాద్ కి అర్థమవుతుంది. ఆ కంపెనీ పై కేసు వేస్తాడు ప్రసాద్. మరి ఆ కేసు ఏమైంది ?, ఈ కేసులో ఎలాంటి వాదోపవాదాలు జరిగాయి ?, కోటి రూపాయిలు నష్టపరిహారం చెల్లించాలని పట్టుబడ్డిన ప్రసాద్ వాదన ఎలా సాగింది ?, అసలు ప్రసాద్ కేసుని గెలిచాడా ?, లేదా ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
నేటి సమాజంలో మధ్య తరగతి జీవితాల్లో జరుగుతున్న సంఘటనలు ఆధారంగా రాసుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా నేటితరం జంటలు పెళ్లి తర్వాత పిల్లల్ని కనడానికి ఎందుకంతగా ఆలోచించాల్సి వస్తోందనే అంశాన్ని చాలా బాగా చెప్పారు. దర్శకుడు సందీప్ రెడ్డి ఫ్యామిలీ కథలో వినోదాన్ని పండించే ప్రయత్నం చేశాడు. దాంతో సినిమాలో కామెడీ టచ్ బాగానే కుదిరింది. ఓపెనింగ్ నుంచి సుహాస్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది.
ముఖ్యంగా సుహాస్ పాత్ర, అతని తండ్రి గోపరాజు రమణ పాత్ర మధ్య నడిచే సన్నివేశాలు మరియు కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ప్రధాన పాత్రలో నటించిన సుహాస్ తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ‘సుహాస్’ తన పాత్రను చాలా బాగా పండించారు. తండ్రి పాత్రలో గోపరాజు రమణ జీవించారు. ఆయన నటన అద్భుతంగా ఉంది. అదేవిధంగా వెన్నెల కిషోర్ పాత్రతో పాటు ఆయన డైలాగ్స్, ఆయన హావభావాలు బాగానే నవ్వు తెప్పించాయి.
ఎమోషనల్ టోన్ లో నడిచిన భార్య పాత్రలో సంగీర్థన ఆకట్టుకుంది. జడ్జ్ గా రాజేంద్ర ప్రసాద్ నటన చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన మురళీ శర్మ, ప్రభాస్ శ్రీను మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
సందీప్ రెడ్డి బండ్ల తీసుకున్న కథాంశం, మరియు సుహాస్ – గోపరాజు రమణ పాత్రలు బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా చాలా స్లోగా సాగింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో సిల్లీగా అనిపిస్తోంది. పైగా కీలక సన్నివేశాలు కూడా లాజికల్ గా కనెక్ట్ కావు. ముఖ్యంగా హీరోయిన్ సంగీర్థన పాత్రతో పాటు ‘ఎంజాయ్ కంపెనీ’ తాలూకు పాత్రలను కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది.
అలాగే, హీరోహీరోయిన్ల మధ్య స్టార్టింగ్ లో వచ్చే సన్నివేశాలు కూడా ల్యాగ్ అయ్యాయి. నిజానికి పిల్లల్ని కంటే వాళ్ళకి ది బెస్ట్ ఇవ్వాలి, లేదా కనడమే మానేయాలనుకునే హీరో ఫిలాసఫీ బాగుంది. ఈ పాయింట్ చుట్టూ ఇంకా కాన్ ఫ్లిక్ట్ ను బిల్డ్ చేసి.. హీరోహీరోయిన్ల ఫ్యామిలీస్ మధ్య కూడా బరువైన భావోద్వేగాలను పెట్టి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా దర్శకుడు స్క్రిప్ట్ లో ఉన్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ అండ్ బోరింగ్ సీన్స్ ను ఎంటర్ టైన్ గా మలచలేకపోయారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడిగా ఆకట్టున్నా.. స్క్రీన్ ప్లే పరంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు పర్వాలేదు. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదు. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
‘జనక అయితే గనక’ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ ఫన్ డ్రామాలో.. కొన్ని కామెడీ సీన్స్, మరియు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నాయి. ఐతే, మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సెకండాఫ్ బోరింగ్ ప్లేతో స్లోగా సాగడం, అలాగే కొన్ని సిల్లీ ట్రాక్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ యూత్ ని మెప్పించినా, మిగిలిన వర్గాల ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోవచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team