‘దేవ‌ర‌’పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన జాన్వీ క‌పూర్

‘దేవ‌ర‌’పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన జాన్వీ క‌పూర్

Published on Jul 22, 2024 5:50 PM IST


మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ న‌టిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవ‌ర’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తుండ‌టంతో ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్, ఫ‌స్ట్ సాంగ్ ఈ సినిమాపై అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి జాన్వీ క‌పూర్ ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని వెల్ల‌డించింది. జాన్వీ తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో దేవ‌ర సినిమాపై ఈ కామెంట్స్ చేసింది. దేవ‌ర సినిమాతో సౌత్ ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌ని ఆమె తెలిపింది.

ఇక దేవ‌ర సినిమాలో త‌న పాత్ర బాగుంటుంద‌ని, దేవ‌ర పార్ట్-2లో త‌న పాత్రకు మ‌రింత స్కోప్ ఉంటుంద‌ని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో దేవ‌ర పార్ట్-1లో జాన్వీ పాత్ర ఎలా ఉంటుందా.. పార్ట్-2లో ఆమె పాత్ర‌ను హైలైట్ చేయనున్నారా.. అనే ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్న దేవ‌ర పార్ట్-1 చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు