ఆ సినిమా నుంచి తప్పుకోవాలనుకున్నా – జాన్వీకపూర్‌

ఆ సినిమా నుంచి తప్పుకోవాలనుకున్నా – జాన్వీకపూర్‌

Published on May 16, 2024 12:59 AM IST

హీరోయిన్ జాన్వీకపూర్‌ ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్‌ విశేషాలను తాజాగా జాన్వీ పంచుకుంది. ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడినట్లు జాన్వీ చెప్పుకొచ్చింది. జాన్వీ కపూర్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం ‘మిలీ’ సినిమా షూటింగ్‌ సమయంలోనే శిక్షణ తీసుకున్నాను. ఐతే, పూర్తిగా నేర్చుకోవడానికి రెండేళ్లు పట్టింది. నా కోచ్‌ లు నన్ను పూర్తి క్రికెటర్‌గా మార్చడానికి చాలా కష్టపడ్డారు.

ఐతే, ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నాకు ఎన్నో గాయాలయ్యాయి. ఓ దశలో అయితే, నా రెండు భుజాలు పనిచెయ్యవేమో అనుకున్నాను. ఆ సమయంలోనే ఎన్నోసార్లు ఈ సినిమా నుంచి నేను వైదొలగాలని భావించాను. కానీ, ఈ చిత్ర యూనిట్ నాకు ధైర్యం చెప్పారు. నన్ను ముందుకు నడిపారు’ అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు