నాకు అలాంటి వాడే కావాలి – జాన్వీ కపూర్

నాకు అలాంటి వాడే కావాలి – జాన్వీ కపూర్

Published on May 16, 2024 10:04 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ఐతే, జాన్వీకపూర్‌ ప్రస్తుతం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ చిత్రం మే31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తొలి పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో జాన్వీ మాట్లాడుతూ.. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పింది.

ఇంతకీ, జాన్వీ కపూర్ ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే విందాం. ‘నాకు కాబోయే భర్త, నా కలలను తనవిగా భావించాలి. ఎప్పుడూ నన్ను సంతోషంగా ఉంచాలి. అలాగే, ఆపదలో నాకు ధైర్యం చెప్పాలి. నేను ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి నాకు అండగా నిలబడాలి. అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను’ అంటూ జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. మరి అలాంటి అబ్బాయి, జాన్వీ కపూర్ కి దొరూతాడో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

అన్నట్టు గత కొంతకాలంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్‌ షిండే మనవడు శిఖర్‌తో జాన్వీ కపూర్ డేటింగ్‌లో ఉన్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు