ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా


రీసెంట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాల్లో టాలెంటెడ్ హీరో రాజ్ కుమార్ రావ్ అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ లు నటించిన ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామా “మిస్టర్ అండ్ మిస్ మాహి” కూడా ఒకటి. దర్శకుడు శరన్ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాలీవుడ్ మార్కెట్ లో యావరేజ్ టాక్ తెచుకున్నప్పటికీ వసూళ్ల పరంగా బాగానే రన్ అయిపోయింది.

అయితే ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. డీసెంట్ ఫ్యామిలి ఎమోషన్స్ తో సాగే ఈ స్పోర్ట్ డ్రామాలో రాజ్ కుమార్ రావ్, జాన్వీ కపూర్ లు సాలిడ్ పెర్ఫామెన్స్ లు అందించారు. మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు అయితే నేటి నుంచి దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. చూడవచ్చు. కాకపోతే హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో అందుబాటులో ఉంది. ఇక చిత్రం చూడాలి అనుకునేవారు ట్రై చేయవచ్చు.

Exit mobile version