ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ నాలుగు రోజులుగా పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో జానీ మాస్టర్ ని నాలుగు రోజులపాటు నార్సింగీ పోలీసులు విచారించడం జరిగింది. బాధితురాలి స్టేట్మెంట్ ను ముందుంచి… జానీ మాస్టర్ ను పలు ప్రశ్నలు అడిగారు పోలీసులు.
అయితే, నాలుగు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో.. జానీమాస్టర్ ని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచి, ఆ తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించారు. మొత్తానికి జానీ మాస్టర్ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై రంగారెడ్డి కోర్టులో సోమవారం విచారణ జరగబోతుంది. మరి బెయిల్ వస్తోందా ?, ఒకవేళ రాకపోతే, ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.