ఆ ఆరోపణలపై జానీ మాస్టర్ మండిపాటు!

ఆ ఆరోపణలపై జానీ మాస్టర్ మండిపాటు!

Published on Jan 29, 2025 12:59 PM IST

టాలీవుడ్ సహా పాన్ ఇండియా లెవెల్లో కూడా మంచి ఫేమ్ ఉన్న ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కోసం అందరికీ తెలిసిందే. అయితే జానీ మాస్టర్ ఇటీవల ఓ కేసు విషయంలో జైలుకి వెళ్లి బయటకి రావడం కూడా జరిగింది. అయితే ఇపుడు జానీ మాస్టర్ తన ఫ్యామిలీ సహా వర్క్ లో కూడా బిజీగా ఉన్నారు.

అయితే జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సమయంలో టాలీవుడ్ వాయిస్ ఆఫ్ విమెన్ సంస్థలో సభ్యురాలు అయినటువంటి ప్రముఖ నటి అలాగే యాంకర్ ఝాన్సీ జానీ మాస్టర్ విషయంలో తీసుకున్న స్టాండ్ అందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్ గా అతని విషయంలో చేసిన పోస్ట్ వైరల్ గా మారిన నేపథ్యంలో జానీ మాస్టర్ కౌంటర్ ఇవ్వడం జరిగింది.

తన సస్పెన్షన్ ఆర్డర్ ని కోర్ట్ లో జానీ మాస్టర్ ఛాలెంజ్ చేయగా ఆ కేసుని జానీ మాస్టర్ ఓడిపోయినట్టుగా ఝాన్సీ ప్రచారం చేశారు. ఈ విషయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ కి కూడా థాంక్స్ చెప్పడంపై జానీ మాస్టర్ ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చారు.

“తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది” అంటూ కొంచెం సీరియస్ గానే తన స్పందన తెలియజేసారు. దీనితో తన కౌంటర్ ఇపుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు