క్రేజీ..తారక్ పై జపాన్ మినిస్టర్ కామెంట్స్ వైరల్.!

క్రేజీ..తారక్ పై జపాన్ మినిస్టర్ కామెంట్స్ వైరల్.!

Published on Jul 28, 2023 3:19 PM IST

NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం కన్నా ముందు తాను చేసిన సెన్సేషనల్ గ్లోబల్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” తో అయితే గ్లోబల్ గా మరింత క్రేజ్ ని తారక్ తెచ్చుకున్నాడు. అయితే ఈ చిత్రం గత ఏడాది జపాన్ లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ కాగా ఈ చిత్ర హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ లకి కూడా అక్కడ భారీ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

మరి లేటెస్ట్ గా అయితే ఎన్టీఆర్ పై జపాన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ యోషిమాస హయాషి చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ మీట్ లో తాను మాట్లాడుతూ RRR లో ఇద్దరు హీరోలు ఉన్నారు నేను అయితే ఎన్టీఆర్ ని ప్రిఫర్ చేసుకంటాను అని తాను తెలిపారు. దీనితో ఈ స్టేట్మెంట్ ఫ్యాన్స్ ని మరింత కేజ్రీగా మార్చగా తన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు